Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఎక్కడా వెనకబడలేదు

ఏపీ ఎక్కడా వెనకబడలేదు
X

ఏపీకి విదేశీ సంస్థలు రుణంతో పాటు గ్రాంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కోరినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విషయంలోనూ వెనకబడలేదన్నారు. ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలను ఖండించారు. రాష్ట్రంలో వృద్ధి రేటు ఎక్కడ తగ్గిందో చూపించాలని బుగ్గన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 2019 నుంచి ఆర్థిక మాంద్యం ఉందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు, లక్ష్యాలను ఎప్పుడూ అందుకోలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో రెండంకెల వృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.

వాళ్ళ పాలనలో మూడేళ్ల అంచాలు వరుసగా తగ్గాయని తెలిపారు. 2018-19లో ఎంతో ఆర్థిక ప్రగతి సాధించినట్టు చెప్పుకున్నారని.. కానీ టీడీపీ నేత యనమల చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవని చెప్పారు. రెవెన్యూ రాబడి 40 శాతం పడిపోయిందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం విషయంలోనూ యనమల తప్పుడు లెక్కలే చెప్పారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలరాసిందని కూడా అబద్ధాలు చెప్పారు. 2018-19లో సంక్షేమానికి టీడీపీ 5600 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమానికి రూ. 20,100 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.

Next Story
Share it