Telugu Gateway
Andhra Pradesh

అప్పులు చేయక తప్పదు..బుగ్గన

అప్పులు చేయక తప్పదు..బుగ్గన
X

మూలధన వ్యయ పనుల కోసం ఏపీ సర్కారు అప్పులు చేయకతప్పదని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్ధిక సంస్థల నుంచి కూడా అప్పులు సేకరిస్తామన్నారు. ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం నాడు ఢిల్లీలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయింది. ఈ భేటీ అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, పీడీఎస్, జీఎస్టీ బకాయిల మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి చేయూత ఇచ్చేందుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.

‘‘అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ముఖ్యమంత్రి ఇచ్చిన నివేదికలు కేంద్రానికి ఇచ్చాం. 3,500 కోట్ల రూపాయల రీయంబర్స్‌ మెంట్‌‌ చేయాల్సి ఉంది. పోలవరం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చుపెట్టి రీయంబర్స్‌ మెంట్‌ అడుగుతోంది. కోవిడ్ కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉంది. విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు నిధుల తో కొత్త ప్రాజెక్టులకు ఉపయోగిస్తాం. జీఎస్టీ బకాయిలు 3500 కోట్లు రావాలని’’ బుగ్గన తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ లో రాష్ట్రానికి 40 శాతం ఆదాయం పడిపోయిందని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ని కలిసి పోలవరం నిధులను విడుదల చేయాలని అడుగుతామని మంత్రి బుగ్గన చెప్పారు.

Next Story
Share it