ఆగస్టులో అయోధ్య రామ మందిరం భూమి పూజ
BY Telugu Gateway18 July 2020 3:35 PM GMT

X
Telugu Gateway18 July 2020 3:35 PM GMT
చారిత్రక ఘట్టానికి ముహుర్తం ఖరారైందా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానినికి ఆగస్టు3 లేదా 5న భూమి పూజ నిర్వహించాలని రామజన్మ తీర్థ ట్రస్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ రెండు రోజులు చాలా దివ్వమైనవిగా ట్రస్ట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యఅతిధిగా ఆహ్వానించాలని నిర్ణయించారు.
సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో సుదీర్ఘ కాలం సాగిన అయోధ్య వివాదానికి గత ఏడాది ముగింపు దొరికిన విషయం తెలిసిందే. బిజెపి ఎన్నో సంవత్సరాలుగా అయోధ్యలో రామమందిర అంశాన్ని తమ ఏజెండాలో పెడుతోంది. ఇఫ్పుడు అది నెరవేరబోతోంది. భూమి పూజ ప్రారంభించిన వెంటనే నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.
Next Story