ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ..కేబినెట్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. దీనికి సంబంధించి బుధవారం నాడు కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై నివేదిక అందించేందుకు కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాల ఏర్పాటుపై పలు సూచనలు చేయనుంది. జిల్లాల ఏర్పాటులో ఖర్చును నియంత్రించడం సహా వివిధ అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఇందులో సభ్యులుగా సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. సాధ్యమైనంత వేగంగా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. మానవవనరులను వీలైనంత సమర్థవంతగా వినియోగించుకోవడం, మౌళికసదుపాయాలను వినియోగించుకోవడం ఉద్దేశమే కొత్త జిల్లాల ఏర్పాటు లక్ష్యం అని పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఈ పునర్‌వ్యవస్థీకరణ అవసరమని మంత్రివర్గం భావించింది. జిల్లాల ఏర్పాటుపై కమిటీతోపాటు పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని మరింత మందికి వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలు తదితర కేటగిరీ మహిళలకూ చేయూత వర్తింపు కేబినెట్ నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్నవారిలో అదనంగా రూ. 8.21 లక్షలమందికి లబ్ధి జరుగుతుందని అంచనా. వీరుకాక వైఎస్ఆర్ చేయూత కోసం ఇప్పటివరకూ 17.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కింద 45–60 ఏళ్ల మధ్యనున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు విడతల్లో రూ. 75వేల రూపాయలు అందించనున్న ప్రభుత్వం. ఏడాదికి రూ.1540.89 కోట్ల చొప్పున నాలుగేళ్లకు సుమారు రూ.6163.59 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. నాడు – నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించి జీఓ ఎంఎస్ 22కు కేబినెట్ ఆమోదం.
మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లు, కాలేజీల్లో నాడు –నేడు కింద అభివృద్ధి పనులు. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్‌లో 28 పోస్టులకు కేబినెట్ ఆమోదం. 13 పోస్టులు డిప్యుటేషన్ ప్రాతిపదికన, 1 కాంట్రాక్టు ప్రాతిపదికన, 14 పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మంజూరు. 10వేల మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు. దీనికోసం ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ –2006 ( కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) సవరణకు కేబినెట్ ఆమోదం. దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం. రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ విధానం–2020 కి కేబినెట్ ఆమోదం. రాష్ట్రం వెలుపల రెన్యుబుల్ ఎనర్జీ ఎగుమతికి వీలుగా విధానం. సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తి, ఆ ప్రాజెక్టులకు ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వం చర్యలు. ఈ రంగంలో మరింత మంది పెట్టుబడి దారులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు. రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యంపెంపు, కాల్వల విస్తరణ పనులకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌కు కేబినెట్ ఆమోదం.
దీనికోసం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణా ప్రాజెక్ట్స్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్)కు కేబినెట్ అంగీకారం. 100 శాతం ప్రభుత్వ కంపెనీగా వ్యవహరించనున్న ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ క్యాపిటల్ అవుట్ లే రూ. 40వేల కోట్లు. ఈ డబ్బుతో వరద వచ్చే కాలంలోనే నీటిని తాగు, సాగునీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడానికి పనులు చేపట్టనున్న ప్రభుత్వం. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.145.94 కోట్ల రూపాయలను విడుదల, దీనికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు సత్వర చర్యలు చేపడుతున్న ప్రభుత్వం. రూ.2వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి. ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్‌కు డైరెక్టర్ పోస్టు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం. ఇందులో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు శ్రీకాకుళానికీ, 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు ఒంగోలుకు మంజూరు. గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసులు ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం. సీపీఎస్ ఉద్యమంలో భాగంగా టీచర్లు, ఇతర ఉద్యోగలుపై పెట్టిన కేసులను ఉప సంహరించాలని కేబినెట్ నిర్ణయం. ఇసుకకు సంబంధించిన వ్యవహారాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. దేశ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున వైద్యుల పోస్టుల నియామకాలకు ఆమోదం. ఇంత పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేయడం ఇదే ప్రథమం. 9712 పోస్టుల భర్తీకి నిర్ణయం. 5701 కొత్త పోస్టుల భర్తీతోపాటు చాలా కాలంగా భర్తీ కాకుండా ఉన్న 4011 పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయం.