Telugu Gateway
Andhra Pradesh

బాలినేని ఎమ్మెల్యే స్టిక్టర్ తో కారు..ఐదు కోట్ల నగదు పట్టివేత!

బాలినేని ఎమ్మెల్యే స్టిక్టర్ తో కారు..ఐదు  కోట్ల నగదు పట్టివేత!
X

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్టర్ తో ఉన్న ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. అందులో ఏకంగా ఐదు కోట్ల రూపాయల నగదు దొరికింది. తమిళనాడులోని ఓ చెక్ పోస్టులో పట్టుబడిన వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఈ కారు ఏపీకి చెందిన విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉందని తమిళనాడుకు చెందిన ఓ ఛానల్ వెల్లడించింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని అరంబాకం చెక్ పోస్టు వద్ద ఈ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

ఈ కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా నుంచి ఈ కారు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్న వాహనం ఎవరి పేరుతో ఉన్నది తేలాల్సి ఉంది. అరంబాకం పోలీసులు ఈ విషయాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.

ఆ స్టిక్కర్ జిరాక్స్..నాకు సంబంధం లేదు

ఈ వ్యవహారంపై మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి వీడియో ద్వారా స్పందించారు. ఆ కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా జిరాక్స్ అని... ఈ విషయాన్ని మీడియా పరిశీలించాలని కోరుతున్నా. ఆ కారుతో ఉన్న డ్రైవర్లు ఒంగోలు వారు కావవం వల్ల ఎమ్మెల్యేది అని మాట్లాడుతున్నారు. ఆ నగదుతో కూడా తనకు సంబందం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఎవరిది తప్పు ఉంటే వారిని శిక్షించాలని కోరుతున్నట్లు మంత్రి ప్రకటించారు.

Next Story
Share it