Telugu Gateway
Andhra Pradesh

అడ్డంకులు తొలగిపోతే ఆగస్టు 15న ఇళ్ళ స్థలాలు

అడ్డంకులు తొలగిపోతే ఆగస్టు 15న ఇళ్ళ స్థలాలు
X

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన రాజకీయాలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డంకులు కల్పిస్తున్నాయని ఆరోపించారు. ఈ అడ్డంకులు అన్నీ తొలగిపోతే ఆగస్టు 15న పేదలకు ఇళ్ళ పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. జగన్ బుధవారం నాడు ‘జగనన్న పచ్చతోరణం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రమంతటా పచ్చదనంతో నిండిపోయేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడు ‘వనం మనం’ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల్ని నాటాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, అధికారులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఙ చేయించారు. రాష్ట్రంలో టీడీపీతో పాటు ఇతర పక్షాలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయి. కేసులు వేస్తున్నారు. వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Next Story
Share it