Telugu Gateway
Andhra Pradesh

అమరరాజా భూ కేటాయింపు రద్దుపై హైకోర్టు స్టే

అమరరాజా భూ కేటాయింపు రద్దుపై హైకోర్టు స్టే
X

అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సర్కారు ఈ సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా ఉపయోగించని 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత మొత్తంలో పెట్టుబడి పెట్టలేదని..అదే సమయంలో ఉపాధి అవకాశాలు కూడా కంపెనీ చెప్పిన మేరకు కల్పించలేదనే అంశాలను కారణాలుగా చూపుతూ ఈ కేటాయియింపును రద్దు చేశారు.

సర్కారు నిర్ణయంపై కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు భూ కేటాయింపుల రద్దు నిర్ణయంపై స్టే విధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాలో ఈ సంస్థకు 483 ఎకరాలు కేటాయించారు. అందులో నుంచే సర్కారు ఇంకా ఉపయోగించని 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు ఇఛ్చింది. హైకోర్టు స్టేతో ప్రస్తుతానికి ఈ ప్రక్రియకు బ్రేకులు పడనున్నాయి.

Next Story
Share it