Telugu Gateway
Andhra Pradesh

ఏపీ రాజకీయాల్లో ఆ ముగ్గురి భేటీ కలకలం!

ఏపీ రాజకీయాల్లో  ఆ ముగ్గురి భేటీ కలకలం!
X

నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్. వైసీపీ సర్కారు ఆయన్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) పదవి నుంచి తప్పించటం...ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవటం. దీనిపై ఏపీ సర్కారు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లటం. అంతకు ముందే కేంద్ర హోం శాఖకు రమేష్ కుమార్ ఘాటైన పదజాలంతో లేఖ రాయటం. ఆ లేఖ వెనక టీడీపీ ఉందని వైసీపీ విమర్శలు. ఇలా రమేష్ కుమార్ ఏపీలో సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ తరుణంలో హైదరాబాద్ వేదికగా నిమ్మగడ్డ రమేష్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ సుజనా చౌదరి, ఏపీ మాజీ మంత్రి, బిజెపి నేత కామినేని శ్రీనివాస్ లు ఓ స్టార్ హోటల్ లో భేటీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అసలు వీరు ముగ్గురు ఎందుకు భేటీ అయ్యారు?. దీని వెనక ఉన్న కారణాలు ఏంటి అన్న చర్చ సాగుతోంది.

కామినేని శ్రీనివాస్ అయితే స్వయంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సూచనల మేరకే తాను రమేష్ కుమార్ అక్రమ తొలగింపునకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ వేశానని బహిరంగంగా ప్రకటించారు. కారణాలేమిటో తెలియదు కానీ సుజనా చౌదరి గత కొన్ని రోజులుగా దూకుడు తగ్గించి మౌనంగా ఉంటున్నారు. అలాంటిది సుజనా చౌదరి, రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లు సమావేశం కావటం కీలక పరిణామంగా మారింది. బిజెపి నేతలు బహిరంగంగానే రమేష్ కుమార్ తొలగింపును తప్పుపడుతున్నారు. వీరు ముగ్గురు ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు సమావేశం అయ్యారు.

దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం. దీనికి సంబంధిన వీడియో ఒకటి ఇఫ్పుడు వెలుగులోకి వచ్చింది. రాజకీయ నేతలుగా ఉన్న సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ఎవరితో భేటీ అయినా పెద్ద వివాదం ఏమీ ఉండదు. అసలు ఏపీ సర్కారు కూడా రమేష్ కుమార్ ఇప్పుడు పదవిలో లేరని చెబుతోంది. తనకు తాను రమేష్ కుమార్ ఇచ్చిన ఆర్డర్ ను కూడా రద్దు చేసి..అది చెల్లదని మరీ ప్రకటించింది. కానీ సాంకేతికంగా చూస్తే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా రాజకీయ నేతలతో హోటల్ లో భేటీ అవటం మాత్రం పలు అనుమానాలకు తావిచ్చే ఛాన్స్ ఉంది.

Next Story
Share it