Telugu Gateway
Andhra Pradesh

కేసులున్న వారికే వైసీపీ రాజ్యసభ టిక్కెట్లు

కేసులున్న వారికే వైసీపీ రాజ్యసభ టిక్కెట్లు
X

తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి వర్ల రామయ్య వైసీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై విమర్శలు గుప్పించారు. పెద్దల సభకు పెద్దలను పంపాలి కానీ వైసీపీ ఏ మాత్రం పెద్దరికంలేని వ్యక్తులను రాజ్యసభకు పంపుతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్ధి మోపిదేవి వెంకటరమణపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, మరో అభ్యర్ధి అయోధ్యరామిరెడ్డి పై దేశ వ్యాప్తంగా కేసులు ఉన్నాయని వర్ల రామయ్య ఆరోపించారు. పరిమళ్ నత్వానీ అసలు ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదన్నారు. వైసిపి నేరస్తులను, దోపిడీ దారులను బరిలోకి దింపిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రెండు సీట్లు బిసిలకు ఇచ్చే బదులు ఒక ఎస్సీకి ఎందుకు సీటు ఇవ్వలేదన్నారు. రాజ్యసభ ఓటింగ్ అనంతరం ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని,పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఇప్పటికే డీజిపి , సిఎస్ లు రెండు సార్లు కోర్ట్ బోను ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పోలీసులు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించేలా చేస్తోందని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్డీ విప్ దిక్కరిస్తే పార్టీ సహించదన్నారు.

Next Story
Share it