Telugu Gateway
Politics

పోలీసులు కల్వకుంట్ల సైన్యంగా పనిచేస్తారా?

పోలీసులు కల్వకుంట్ల సైన్యంగా పనిచేస్తారా?
X

తెలంగాణలో అధికార పార్టీకి నిబంధనలు ఒకలా..సామాన్య ప్రజలకు మరోలా పనిచేస్తాయా అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ కొండపోచమ్మ ప్రాజెక్టును వేల మందితో ప్రారంభిస్తే లేని సమస్య..తాము ప్రాజెక్టుల సందర్శనకు వెళితే ఎందుకొస్తుందని ప్రశ్నించారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో ప్రాజెక్టులు సందర్శిస్తే అది తప్పేలా ఆవుతుందని, కాంగ్రెస్ నాయకులను అక్రమంగా నిర్భందించారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా సింగూరు, మంజీరా నింపుతామని సీఎం అసెంబ్లీలో హామీ ఇచ్చారని, జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు సంగారెడ్డి పర్యటన తలపెట్టామన్నారు.

సిద్దిపేట మినహా సంగారెడ్డి , మెదక్ జిల్లా అంతా ఎడారే అని, మంజీరకు వెళ్తుంటే అరెస్టు చేశారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్, మంజీరాకు వెళితే మీకేం నష్టమని, ఏ చట్టం, ఏ సెక్షన్ కింద తమను అడ్డుకుంటున్నారని, డీజీపీ ఇండియన్ పోలీస్ సర్వీస్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తొత్తులుగా మీరు మారకండని, పోలీసులు కల్వకుంట ప్రైవేట్ సైన్యంగా మారారా అని ప్రశ్నించారు.

Next Story
Share it