Telugu Gateway
Andhra Pradesh

తిరుమలలో రోజుకు ఏడు వేల మందికే దర్శనం

తిరుమలలో రోజుకు ఏడు వేల మందికే దర్శనం
X

జూన్ 11 నుంచి సాధారణ భక్తులకు అనుమతి

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనాలకు లైన్ క్లియర్ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల దర్శనానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయన టీటీడీ ఈవో అనిల్ అగర్వాల్ తోకలసి మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

8వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా భక్తుల దర్శనం ప్రారంభం

8,9 వ తేదీల్లో గుర్తింపు కార్డు కలిగిన ఉద్యోగులను అనుమతిస్తాం

10వ తేదీ స్థానికులను అనుమతిస్తాం, 11వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులను అనుమతిస్తాం

రోజుకు 7వేల మంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉంది

3వేల టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతాం, ఆఫ్ లైన్ లో టికెట్లను అలిపిరి వద్ద టిక్కెట్లు జారీ

సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకున్నాం

65 ఏళ్ళ వృద్దులు,10 ఏళ్ళ లోపు చిన్నపిల్లలను అనుమతించారని కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్ పాటిస్తున్నాం

కళ్యాణ కట్ట, హుండీ, ప్రసాదాలు వద్ద కూడా కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నాం

కంటైన్మెంట్ జోన్ లో ఉన్న భక్తులు కరోనా ప్రభావం తగ్గే వరకు స్వామి వారి దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి

ఉదయం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతి

ఉదయం 6 నుంచి 7 గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనాలు

ఉదయం 6 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతిస్తాం.., శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలికంగా భక్తుల అనుమతి నిషేధం

ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు ఘాట్ రోడ్డులో అనుమతి

భక్తుల విన్నపం మేరకు లడ్డు ప్రసాదాలు పంపిణీ చేశాం.., 8వ తేదీ నుంచి బయట ప్రాంతాల్లో లడ్డు పంపిణీ నిలిపివేస్తాం

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్, డిస్ఇన్ఫెక్షన్ ట్యూనాల్స్ ఏర్పాటు చేసాం

ఉద్యోగుల లోపం వల్లే భూముల విషయంలో మీడియాలో దుష్ప్రచారం జరిగింది, వారిపై చర్యలు తీసుకున్నాం

ఆన్ లైన్ లో టిక్కెట్లు పొందిన భక్తులకు అలిపిరి, క్యూ లైన్, నడక దారిలో థర్మల్ స్క్రీనింగ్, డిస్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది

ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు ఆన్ లైన్ లోనే రూములు పొందే అవకాశం కల్పిస్తున్నాం

ఒక రూముకి ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తాం, ఒకరోజ సరిసంఖ్య, మరొక రోజు బేసి సంఖ్య రూములను కేటాయిస్తాం

ఒక్కరోజు మాత్రమే గదులు ఇవ్వడం జరుగుతుంది.,

పుష్కరిణి స్నానం నిషేధం, కళ్యాణ కట్టలో పనిచేసే ఉద్యోగులకు పిపిఈ కిట్లు ఇస్తాం

రోజుకు 200 మందికి ర్యాండం గా కరోనా టెస్టులు

క్యూ లైన్ లో పీపీఈ కిట్లతో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకొని భక్తులు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు

రెండు క్యూలైన్ లు అందుబాటులో ఉంచాం, ప్రతి రెండు గంటలకు ఒకసారి క్యూలైన్ శుద్ధి చేస్తాం

వకుళ మత, నరసింహ స్వామి ఆలయంలోకి భక్తుల అనుమతి తాత్కాలికంగా నిషేధం

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల తరువాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తాం

అన్నప్రసాదం భోజన శాలలో సోసియల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు

ప్రతి రెండు గంటలకు ఒక సారి అన్నప్రసాదం వితరణ కేంద్రం డిస్ ఇన్ఫెక్షన్ చేస్తాం

వైకుంఠం క్యూకాంప్లెక్స్, వసతి గృహాల వద్ద అన్నప్రసాదం.వితరణ తాత్కాలికంగా నిలిపివేశాం

కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నాం

ఇతర రాష్ట్రాల నుంచి టిక్కెట్లు పొందినా భక్తులు ఆ రాష్ట్రంలో అనుమతి వాళ్లే తీసుకోవాలి

ఒక్కరోజు ముందుగానే టోకెన్లు పొందాల్సి ఉంటుంది, ఎస్ఎస్డీ టైమ్స్ స్లాట్ కౌంటర్లో టికెట్స్ పొందాల్సి ఉంటుంది

10వ తేదీ నుంచి టిక్కెట్లు జారీ చేస్తాం., పరిస్థితి బట్టి టికెట్ల పెంపుపై నిర్ణయం టీలుకుంటాం

ప్రోటోకాల్ విఐపిలు వ్యక్తిగతం వచ్చిన వారికి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు జారీ

Next Story
Share it