Telugu Gateway
Telangana

తెలంగాణ హోం మంత్రికి కరోనా

తెలంగాణ హోం మంత్రికి కరోనా
X

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు ఆదివారం అర్ధరాత్రి ఈ విషయం ఈ నిర్ధారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితమే హోం మంత్రి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. హోం మంత్రికి ఆస్తమా కూడా ఉండటంతో ముందు జాగ్రత్తగా ఆయన కుటుంబ సభ్యులు మంత్రిని జూబ్లిహిల్స్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు కరోనా వైరస్ బారిన పడ్డారు.

తాజాగా ఏకంగా హోం మంత్రి కూడా ఈ జాబితాలో చేరటం గమనార్హం. తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ విస్తృతి చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే తెలంగాణ సర్కారు టెస్ట్ ల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. దేశంలోనే అతి తక్కువ టెస్ట్ లు చేసిన రాష్ట్రాల్లో తెలగాణ ఒకటిగా ఉంది. టెస్ట్ లు నిర్వహించి బాధితులను గుర్తిస్తే ఈ వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చు. కానీ సర్కారే టెస్ట్ లకే ఆసక్తి చూపకపోవటంతో వైరస్ సోకి వేలల్లో కరోనా బారిన పడుతున్నారు.

Next Story
Share it