Telugu Gateway
Telangana

తెలంగాణలో కరోనా టెస్ట్ ధర 2200 రూపాయలు

తెలంగాణలో కరోనా టెస్ట్ ధర 2200 రూపాయలు
X

తెలంగాణ సర్కారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు సంబంధించి ధరను నిర్ణయించింది. 2200 రూపాయలు పరీక్షల ధరగా పేర్కొన్నారు. కరోనా టెస్ట్ లతో పాటు వైద్య సేవలుకు సంబంధించిన ధరలను కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స అందిస్తే రోజుకు 7500 రూపాయలు, వెంటిలేటర్ తో ఐసీయూలో చికిత్సకు రోజుకు 9000 రూపాయలుగా ఛార్జీలను ఖరారు చేశారు. సాదారణ ఐసోలేషన్ కు మాత్రం 4500 రూపాయలు అని మంత్రి ఈటెల తెలిపారు. యాంటీ బయోటిక్ మెడిసిన్స్ వాడితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారన్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్న వారికైనా పరీక్షలు చేస్తామని ఈటెల వెల్లడించారు. ఆదివారం నాడు కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన సీఎం కెసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్ట్ లు,,వైద్యానికి సంబంధించిన ఛార్జీలను ఖరారు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నాయని ఈటెల తెలిపారు

. ప్రభుత్వం ఖచ్చితంగా ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో సామాజిక వ్యాప్తి లేదని కేంద్రమే చెప్పిందని తెలిపారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా సరే ఏ మాత్రం లక్షణాలు లేకపోతే మాత్రం ఇంట్లో ఉంచే వైద్యం అందిస్తామని తెలిపారు. ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్ ల్లోనే టెస్ట్ లు చేస్తారని..ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు.డబ్బులు కట్టే ఉద్దేశం ఉన్న వారే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం మాత్రం అందరికీ ఉచితంగా చికిత్స అందిస్తుందని వెల్లడించారు

Next Story
Share it