Telugu Gateway
Andhra Pradesh

గవర్నర్ ప్రసంగంలో ‘మూడు రాజధానుల’ ప్రస్తావన

గవర్నర్ ప్రసంగంలో ‘మూడు రాజధానుల’ ప్రస్తావన
X

ఏపీ సర్కారు తాను తలపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని మరోసారి గవర్నర్ ప్రసంగంలో చేర్చింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన ఉపన్యాసంలో పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఇది కీలక అంశం అని..ప్రస్తుతం శాసన ప్రక్రియలో ఉందని తెలిపారు. దీని ప్రకారం అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం, కోర్టు కేసుల కారణంగా ఆగింది కానీ లేకపోతే ఇఫ్పటికే విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ తరలిపోయేదనే విషయం తెలిసిందే.

ఈ సమావేశాల్లో మొత్తం ఎనిమిది బిల్లులు పెడుతున్నామని..సీఆర్ డీఏ బిల్లు కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. వాస్తవానికి ఈ బిల్లు మండలిలో ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్ళీ సీఆర్ డీఏ బిల్లు వస్తే ఈ సారి ఎలాంటి పరిణామాలు ఉంటాయో వేచిచూడాల్సిందే.కరోనా కారణంగా ప్రభుత్వం పూర్తిగా అధికారిక బిజినెస్ పైనే ఫోకస్ పెడుతోంది. బడ్జెట్ తోపాటు అత్యవసరం అయిన బిల్లుల ఆమోదం కోసం సన్నాహాలు చేస్తున్నారు.

Next Story
Share it