Telugu Gateway
Telangana

వేతనాల కోతకు తోడు మీడియాను వణికిస్తున్న కరోనా

వేతనాల కోతకు తోడు మీడియాను వణికిస్తున్న కరోనా
X

నిత్యం వార్తల కవరేజ్ లో తలమునకలై ఉండే మీడియా సిబ్బందిని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అగ్రశ్రేణి మీడియా సంస్థల్లో పలు కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా మరో 23 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీరంతా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న వారే. జర్నలిస్ట్ మనోజ్ మరణం తర్వాత హైదరాబాద్ లో పని చేస్తున్న 140 మంది జర్నలిస్టులు విడతల వారీగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వెలుగుచూసిన పాజిటివ్ కేసులతో జర్నలిస్టులు భయం భయంగా విధులు నిర్వహించాల్సి వస్తోంది.

మీడియా యాజమాన్యాలు మాత్రం ఉద్యోగుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. పైగా అగ్రశ్రేణి మీడియా సంస్థలు సైతం వేతనాల్లో భారీ ఎత్తున కోతలు విధించాయి. ఓ వైపు ఈ సంక్షోభ సమయంలో జీతాల్లో కోతలు వేయటం ఒకెత్తు అయితే..మరో వైపు కరోనా వైరస్ భయంతో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొన్ని పత్రికా యాజమాన్యాలు పాజిటివ్ కేసుల విషయాన్ని ప్రభుత్వానికి తెలియపర్చకుండా దాస్తున్నాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి.కరోనా కారణంగా యాడ్స్ తగ్గిపోయాయనే కారణంతో పలు మీడియా సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో భారీ కోతలు పెట్టిన విషయం తెలిసిందే.

Next Story
Share it