Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

దేవాలయాలు…మాల్స్ ఓపెన్

0

అన్ లాక్ 1లో భాగంగా ఇచ్చిన మినహాయింపులతో సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు, మాల్స్, రెస్టారెంట్లు ప్రారంభం అయ్యాయి. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలతోపాటు అన్ని దేవాలయాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. తొలి దశలో తిరుమలలో కేవలం ఉద్యోగులు, స్థానికులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. జూన్ 11 నుంచి సాధారణ భక్తులకు కూడా దర్శనభాగ్యం దక్కనుంది. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ వెసులుబాటు దక్కనుంది. జూన్ 11 నుంచి తొలుత రోజుకు ఏడు వేల మందికి మాత్రమే దర్శనం కల్పించాలని యోచించినా..ఇప్పుడు  ఆ సంఖ్యను పెంచటానికి అవకాశం ఉందని టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు.

- Advertisement -

తిరుమలతోపాటు చిత్తూరు జిల్లాలోని అన్ని దేవాలయాలు, తెలంగాణలోని యాదాద్రితోపాటు ఇతర దేవాలయాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఓ వైపు కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు మీద ఉన్న  రెస్టారెంట్లు కూడా ఓపెన్ కావటంతో ప్రజల నుంచి ఏ మేరకు స్పందన లభిస్తుందో అన్న అనుమానం మాల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాల్లో నెలకొంది. ఒక వారం రోజుల పాటు గడిస్తే కానీ అసలు స్పందన తెలియదు అని చెబుతున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు ప్రారంభం అయ్యాయి. థియేటర్లు, పిల్లల గేమింగ్ జోన్స్ పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి.

 

 

Leave A Reply

Your email address will not be published.