Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
X

రాజ్యాంగ సంస్థలతో ఆడుకోవద్దు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్కారు అప్పీల్ చేయగా..ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బోబ్డే రాజ్యాంగ సంస్థలతో ఆడుకోవద్దని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు కూడా సుప్రీం నో చెప్పింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ కేసులో ప్రతివాదులు చాలా మంది ఉన్నారని..వారందరికీ నోటీసులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కేవలం రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించేందుకే తీసుకొచ్చినట్లు కన్పిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి చేసిన ధర్మాసనం..హైకోర్టు ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోబోమని..తర్వాత మాత్రం వాదనలు వింటామని పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు స్టే నిరాకరించటంతో రమేష్ కుమార్ ఇప్పుడు బాధ్యతలు చేపట్టవచ్చా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it