Telugu Gateway
Politics

కాంగ్రెస్ కు చైనా నిధులు

కాంగ్రెస్ కు చైనా నిధులు
X

భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దేశంలో ‘రాజకీయ ఉద్రిక్తత’లు కూడా సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాందీలు మోడీ సర్కారుపై వరస పెట్టి ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాహుల్ వేస్తున్న ప్రశ్నలు కేంద్రంలోని బిజెపి సర్కారును చాలా వరకూ ఇబ్బంది పెట్టినవే. దీంతో ఇఫ్పుడు బిజెపి కూడా ఎదురుదాడి ప్రారంభించింది. కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలోని రాజీవ్‌ ట్రస్ట్‌ కు చైనా ఎంబసీ నుంచి నిధులు అందుతున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.

అందుకే కాంగ్రెస్‌ పార్టీలోని మేధావులు చైనాకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చైనాకు కాంగ్రెస్‌ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని.. అక్కడి నుంచి వచ్చే నిధులతోనే ఆ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కాంగ్రెస్ పార్టీపై ఇవే విమర్శలు చేశారు. 2005-06 సంవత్సరాల మధ్య చైనా నుంచి రాజీవ్ గాంధీ పౌండేషన్ చైనా నుంచి మూడు లక్షల డాలర్ల భారీ విరాళాన్ని అందుకుందని తెలిపారు. ఈ నిధులను దేనికి ఉపయోగించారో చెప్పాలన్నారు. దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.

Next Story
Share it