వర్మ కొత్త సినిమా ‘పవర్ స్టార్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త సినిమా ప్రకటించారు. దాని పేరు ‘పవర్ స్టార్’ అచ్చం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న వ్యక్తితో కూడిన ఫోటో, వీడియోలను కూడా విడుదల చేశారు వర్మ. ఇప్పటికే అత్యంత సంచలనం రేపిన అమృత, ప్రణయ్ లకు సంబంధించిన నిజజీవిత కథతో సినిమా తీస్తున్నానని ప్రకటించి వివాదంలో ఇరుక్కున్న ఆయన తాజాగా పవన్ స్టార్ సినిమా ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన అంశాలు ప్రకటించారు.
‘బ్రేకింగ్ న్యూస్.. ఆర్జీవీ వరల్డ్ థియోటర్ కొత్త సినిమాకు ‘పవర్ స్టార్’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు. ‘ నా కొత్త సినిమా ‘పవర్ స్టార్’లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించామని సేర్కొన్నారు.