వైసీపీ నేతలకు రఘురామకృష్ణంరాజు ఛాలెంజ్

ఎవరు బొమ్మ సత్తా ఏందో తేల్చుకుందాం రండి
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ వస్తుంది
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు..ఎమ్మెల్యేలు తనపై చేసిన విమర్శలకు ఘాటైన వ్యాఖ్యలతో సమాధానం ఇచ్చారు. పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సినీ డైలాగ్ లు కూడ చెప్పారు. రాజీనామాకు తాను రెడీ అని..అయితే తన బొమ్మతో గెలిచిన వారు కూడా రాజీనామా చేసి వస్తే తాను కూడా సొంతంగా బరిలోకి దిగుతానని..అప్పుడు ఎవరి బొమ్మ సత్తా ఏంటో చూద్దామని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘కొట్టు సత్యనారాయణ ఇసుక దొంగ. ఎంత మందిని నా చుట్టూ పంపావు సత్యనారాయణ. ఇళ్ళ స్థలాల్లో కూడా అక్రమాలు చేశాడు. నాకు బ్యానర్ కూడా కట్టేవారు లేరా. నీకు అలా కన్పిస్తున్నానా?. సరే ఆ దొంగ సంగతి వదిలేయండి. కారుమూరి నాగేశ్వరరావు...ఇళ్ళ స్థలాల్లో 60 నుంచి 70 ఫిర్యాదు లు వచ్చాయి. 30 నుంచి 35 వేలు వసూలు చేశారు. రేలంగి అనే గ్రామంలో ఓ యువతికి అదనంగా కూడా అడిగారు.
ఈ దొంగలు అందరూ..క్యాష్ కొంత చెక్కులు కొంత వసూలు చేశారు. అనర్హులు నా గురించి మాట్లాడతారు. గ్రంధి శ్రీనివాస్...ఆయన నిజాయతీ గల ఎమ్మెల్యే. రాజకీయంగా తప్పుగా మాట్లాడలేదు. సీఎం అపాయింట్ మెంట్ దొరకటం లేదు అని చాలాసార్లు బాధపడ్డాడు. అతని కన్నా నాకు తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. లోకల్ వాళ్లకు తెలుసు. దీనికి కారణాలు ఏంటో. ఫిబ్రవరి 8వ తారీఖున ప్రశాంత్ కిషోర్ కు చెందిన టీమ్ సభ్యుడి ద్వారా నన్ను ఎక్కడ కలవగలిగాడు. ఎన్నిసార్లు అడిగి..ఎక్కడ కలవగలిగాడో తెలుసుకోండి. విజయసాయిరెడ్డి, రాజిరెడ్డిలను వాళ్లను అడగండి. గుండెల మీద చేతులు వేసుకుని చెప్పమనండి. నేను జగన్ ఇంటికి కూడా వెళ్ళనని అని చెప్పా. కామన్ ప్లేస్ లో కలుస్తామంటే.హైదరాబాద్ విమానాశ్రయంలో లాంజ్ లో కలిశా. అసలు దొంగ మంత్రి రంగనాథరాజు. అతను ..అతను కొడుకు కలసి చేసే దుర్మార్గమైన అవినీతి ఎక్కడా లేదు. కలెక్టర్ కు వచ్చిన ఫిర్యాదుల్లో ఏయే గ్రామం నుంచి ఎంత మంది ఫిర్యాదు చేశారో కనుక్కోండి. ఎవరండీ వీళ్లు ఆఫ్ట్రాల్ గాళ్ళు. ఇలాంటి పనికివాళ్ల గురించి మాట్లాకండి. నా గురించి జగన్మోహన్ రెడ్డిని అడగండి. ప్రసాదరాజుతో బలవంతంగా మాట్లాడించారు. ఆయన హానెస్ట్ పొలిటీషన్. ఈ ఎమ్మెల్యేలు నా బొమ్మ పెట్టుకుని గెలిచారు అంటున్నా. ఈ గుంపు ఏమి అంటుంది జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచారంటున్నారు. నేను నా బొమ్మతో అంటున్నా.
మీ ఐదుగురు కూడా జగన్ బొమ్మ మీద పోటీ చేయండి. నేను పోటీచేస్తా వేరేగా. ఎవడి బొమ్మకు ఎంత వ్యాల్యూ ఉందో తెలుసుకుందాం. మాట్లాడుకోండి. అసెంబ్లీ జరుగుతుంది కదా?. ఇచ్చేయండి. మీవి నిజం రాజీనామాలు అయితే ...నేను కూడా రాజీనామా చేస్తా. ఆ తర్వాత ఏ సమీకరణలు ఎలా మారాలో అప్పుడు డిసైడ్ చేసుకుందాం. పేర్ని నాని. చీటికిమాటికి టీవీలో కన్పించే అందగాడు. చేశాడు. ఎన్నోసార్లు అడిగితే ఛీ అన్నా..రానన్నా. నా ఖర్మో..మీ ఖర్మో వచ్చాను. ఛీ..మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. ఎక్కడో నరనరాల్లోనే వైఎస్ అబ్బాయి జగన్ అన్న అభిమానంతో వచ్చా. సీటు ఇవ్వరని బయటకు వచ్చానా?. యూస్ లెస్ ఫెలోస్. జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. కరోనా కంట్రోల్ అయిన వెంటనే వస్తా నియోజకవర్గానికి . ఎంత మందివస్తారో చూస్తా. నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిది కాదు. చూసుకుందామంటే చూసుకుందాం. ’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.