Telugu Gateway
Politics

కరోనా హోర్డింగ్ లో ‘ఈటెల’కు చోటెక్కడ

కరోనా హోర్డింగ్ లో ‘ఈటెల’కు చోటెక్కడ
X

కెసీఆర్..కెటీఆర్ ఫోటోలు మాత్రమే

ఈ ఫోటో వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ వైపు సీఎం కెసీఆర్. మరో వైపు పురపాలక, ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్. ఇది కరోనాకు సంబంధించిన హోర్డింగ్ యాడ్. కానీ ఇందులో అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఫోటో కూడా లేదు. కరోనాను డీల్ చేసే శాఖ అది. ఆ శాఖ మంత్రి ఈటెల. కానీ అందులో ఏకంగా మంత్రిని తొలగించేసి కేవలం సీఎం కెసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్ ఫోటోలను మాత్రమే వేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఈటెలను మంత్రి పదవి నుంచి తప్పించనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఈటెల రాజేందర్ కూడా గులాబీ జెండాకు అసలైన ఓనర్లం తామే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచే సీఎం కెసీఆర్ కు, ఈటెలకు మధ్య దూరం పెరిగిందని పార్టీలో ప్రచారం ఉంది. ఈటెల వ్యాఖ్యలను అప్పట్లోనే మంత్రి కెటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తలే టీఆర్ఎస్ జెండా అసలైన ఓనర్లు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా వెలుగు చూసిన తొలి రోజుల్లో సీఎం కెసీఆర్ నిత్యం మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించే వారు. తర్వాత ఈ బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కరోనా హోర్డింగ్ లో ఆ శాఖ మంత్రిని తప్పించి సీఎం కెసీఆర్..కెటీఆర్ ఫోటోలు మాత్రమే వాడటం ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it