Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మరో సోషల్ మీడియా అరెస్ట్..గంటా ఫైర్

ఏపీలో మరో సోషల్ మీడియా అరెస్ట్..గంటా ఫైర్
X

వైసీపీ సర్కారు సోషల్ మీడియా వ్యవహారాలపై బాగా టార్గెట్ చేసింది. ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. తాజాగా విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు నలంద కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలంద కిషోర్‌ను మంగళవారం తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు నలంద కిషోర్‌కు మూడు రోజుల క్రితం సీఐడీ నోటీస్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు.

అనంతరం రీజనల్‌ సీఐడీ కార్యాలయానికి ఆయనను తరలించారు. ఐపీసీ 50బి, 5బి, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుందాం కానీ..ఇలా అక్రమ అరెస్ట్ లు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అరెస్ట్ చేయటానికి నలంద కిషోర్ ఏమైనా దేశ ద్రోహనికి పాల్పడ్డారా? లేక దేశ రహస్యాలు ఎవరికైనా చేరవేశారా? అని ప్రశ్నించారు. వాట్సప్ లో వచ్చిన పోస్టును షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా అని గంటా ప్రశ్నించారు. పోస్ట్ ఎవరు క్రియేట్ చేశారో వారిపై చర్య తీసుకోవాలి కానీ...ఫార్వర్డ్ చేసిన వారిని అరెస్ట్ చేయటం ఏమిటన్నారు.

Next Story
Share it