విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన..ఇద్దరు మృతి
BY Telugu Gateway30 Jun 2020 11:15 AM IST

X
Telugu Gateway30 Jun 2020 11:15 AM IST
విశాఖ. కర్నూలు. మళ్ళీ విశాఖ. ఇవీ ఏపీలో వరుసగా జరుగుతున్న గ్యాస్ ప్రమాదాలు. తొలుత ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటన దేశాన్ని నిర్ఘాంతపర్చింది. ఎందుకంటే ఆ రోజు రోడ్లపైనే బాధితులు ఎక్కడికి అక్కడ కుప్పకూలిపోయిన దృశ్యాలు చూసి జనం బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో పది మందికిపైనే చనిపోయారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో ఘటన మర్చిపోక ముందే కర్నూలులోని మరో పరిశ్రమలో గ్యాస్ లీక్ ఓ మేనేజర్ మరణించారు. ఇప్పుడు తిరిగి విశాఖలోనే గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. పరవాడలోని సాయినార్ లైఫ్ సైనెన్స్ లిమిటెడ్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ కంపెనీలో లీకైన వాయువులు పీల్చి ఆరుగురికి అస్వస్థతకు గురయ్యారు. వీరిని గాజువాక ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరు మృతి చెందారు. మిగిలిని నలుగురికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి జరిగినట్లు చెబుతున్నారు.. ప్రమాదానికి కారణమైన సాయినార్ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీపీ మీనా వెల్లడించారు.
Next Story