జగన్ కు ఎవరు అడ్డుచెప్పినా ఇదే పరిస్థితి
BY Telugu Gateway13 Jun 2020 1:50 PM IST

X
Telugu Gateway13 Jun 2020 1:50 PM IST
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎదురుచెప్పినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని మాజీ ఎంపీ, టీడీపీ నేత జె సీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ పై జెసీ స్పందించారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసని, జగన్‌కు అనుకూలంగా ఎవరూ మారకపోయినా ఇదే తరహా అరెస్టులు ఉంటాయని, అది స్వపక్షమైనా.. విపక్షమైనా పరిస్థితిలో తేడా ఉండదని చెప్పారు.
ప్రభాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇప్పటికే ఆయనకుబైపాస్ సర్జరీ అయ్యిందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టును టీవీలో చూసి తెలుసుకున్నానని, రేపు తనను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు దివాకర్ రెడ్డి. సీఎం జగన్ ఎవ్వరికీ భయపడరని, ఆయనకు దేవుడు సైతం లేడన్నారు.
Next Story