Telugu Gateway
Telangana

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలి

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలి
X

తెలంగాణ సర్కారుకు హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులో అత్యంత కీలకమైనది రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు జరుగుతున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితోపాటు పోలీసులకు కూడా రక్షణ కిట్లు ఇవ్వాలని సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిబ్బందికి షిఫ్ట్ ల విధానం అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం నాటి విచారణకు ప్రజారోగ్య విభాగం డైరక్టర్ శ్రీనివాసరావు, గాంధీ సూపరిండెంట్ రాజారావులు హాజరై కోర్టు ముందు పలు అంశాలను ఉంచారు.

రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్ హైల్త్ డైరక్టర్ కోర్టుకు నివేదించారు. గాందీలో ప్లాస్మా, యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు రాజారావు కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కేసుల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఈ కేసుల వివరాలు ఆయా కాలనీ సంఘాలకు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలంటూ ఐసీఎంఆర్ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

Next Story
Share it