Top
Telugu Gateway

నవంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్

నవంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్
X

ప్రధాని మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకూ పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం 90 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ప్రజలు కరోనా కష్టకాలంలో ఉన్నారని...దీంతో పాటు రాబోయే రోజుల్లో వినాయక చవితి, దీపావళి, చత్ పూజ వంటి ఎన్నో పండగలు రాబోతున్నందున కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున భియ్యం, ప్రతి కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఆయన మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. వన్ నేషన్, వన్ కార్డు కింద పేదలందరూ ఈ సౌకర్యం పొందవచ్చన్నారు. పేదలకు ఉచితంగా ప్రభుత్వం ఆహార ధాన్యాలు అందించగలుగుతుంది అంటే దీనికి ఇద్దరే కారకులు అని..అందులో ఒకరు రైతులుగా కాగా, రెండు నిజాయతీగా పన్ను చెల్లించిన వారు అని మోడీ పేర్కొన్నారు. దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందనుందని వెల్లడించారు. కరోనాపై పోరు విషయంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే ఎంతోమెరుగ్గా ఉందని వెల్లడించారు. లాక్ డౌన్ అమలు చేయటం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం వచ్చినందున ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు...‘మనం అన్ లాక్ 2.0 లో ఎంటర్ అయ్యాం. అన్ లాక్ 1.0లో నిర్లక్ష్యంగా ఉండటంతో కేసులు పెరిగాయి. గ్రామ సర్పంచ్ అయినా,ప్రధాని అయినా నిబంధనలు పాటించాల్సిందే. ప్రపంచదేశాల్లో కరోణా మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనదేశంలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మన ఈ పోరాటం 130కోట్ల భారతీయులను కాపాడుకోవడం కోసమే. కంటైన్ మెంట్ జోన్లపై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. మాస్క్ విషయంలో కఠినంగా ఉండాలి. మాస్క్ లేకుండా బయటకు వెళ్ళినందుకు ఒక దేశ ప్రధానికి ఫైన్ వేశారు. కోవిడ్ నిబంధనలు పాఠించకపోతే భారి జరిమానాలు విధించాలి.దేశంలో ఏ ఒక్కరు చట్టానికి అతీతులు కారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేరకమైన అప్రమత్తతను ప్రదర్శించాలి. దేశంలో కొన్ని రాష్ట్రాలు అద్భుతమైన పనితీరు ప్రదర్శించాయి’ అని పేర్కొన్నారు.

Next Story
Share it