Telugu Gateway
Andhra Pradesh

జె సీ ప్రభాకర్ రెడ్డి..అస్మిత్ రెడ్డి అరెస్ట్

జె సీ ప్రభాకర్ రెడ్డి..అస్మిత్ రెడ్డి అరెస్ట్
X

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జె సి ప్రభాకర్ రెడ్డి శనివారం నాడు అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ఈఎస్ ఐ స్కామ్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ అనంతరం వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు.

బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్‌ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌ పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it