Telugu Gateway
Politics

‘బంకర్’లో దాక్కున్న డొనాల్డ్ ట్రంప్

‘బంకర్’లో దాక్కున్న డొనాల్డ్ ట్రంప్
X

వైట్ హౌస్ ముందు అల్లర్లు పెద్ద ఎత్తున చెలరేగటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంకర్ లో దాక్కున్నారా?. అంటే ఔననే వార్తలు వస్తున్నాయి. పోలీస్ కస్టడీలో నల్లజాతీయుడి మృతికి నిరసనగా అమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు వైట్ హౌస్ ముందు గేట్ల దగ్గర గుమిగూడి లోపలికి ఇటుకలు..బాటిళ్ళు విసిరారు. ఈ సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ను వైట్ హౌస్ లోని అండర్ గ్రౌండ్ బంకర్ లోకి తీసుకెళ్ళారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

ఆయన బంకర్ లో గంటకుపైగా గడిపారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఓ వైపు అగ్రరాజ్యాన్ని కరోనా టెన్షన్ పెడుతున్న సమయంలో ఈ నిరసనలు మరింత టెన్షన్ రేపుతున్నాయి. ఆదివారం రోజు వాషింగ్టన్ డీసీతో పాటు 40 పట్టణాల్లో ఆందోళనలను కట్టడి చేసేందుకు కర్ఫ్యూ విధించారు. ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మిన్నీపోలీస్ నగరంలో పోలీస్ కస్టడీలో మరణించినప్పటి నుంచి ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

Next Story
Share it