Telugu Gateway
Latest News

వారంలో కోటికి కరోనా కేసులు

వారంలో కోటికి కరోనా కేసులు
X

నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) అంచనా ఇది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటికి చేరనున్నాయట. అది కూడా వారం రోజుల్లోనే అట. భారత్ తోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకూ కొత్త రికార్డులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత తొలి నెలలో కేవలం పది వేల కేసులు రాగా..గత నెలలో మాత్రం ఏకంగా 40 లక్షల కేసులు నమోదు అయ్యాయని డబ్ల్యూహెచ్ వో చీఫ్ ట్రెడోస్ అథనామ్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 90.39 లక్షల కేసులు ఉన్నాయి.

ఒక్క అగ్రరాజ్యం అమెరికాలోనే ఏకంగా 2.43మిలియన్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ కూడా కరోనా కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా నాలగవ స్థానంలో ఉంది. అయితే ఇఫ్పటివరకూ కరోనా కేసులు ఎప్పటికి పూర్తిగా తగ్గిపోతాయనే అంశంపై మాత్రం ఎవరి నుంచి స్పష్టత రావటం లేదు. అందరూ కరోనాతో సహజీవనం చేయటానికి రెడీ అయిపోయారు. కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ వస్తే తప్ప..ఇది ఇప్పట్లో అంతం అయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

Next Story
Share it