Telugu Gateway
Andhra Pradesh

జగన్ ప్రతీకారేచ్చకు ఈ అరెస్ట్ లు నిదర్శనం

జగన్ ప్రతీకారేచ్చకు ఈ అరెస్ట్ లు నిదర్శనం
X

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జె సీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిల అరెస్ట్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఖండించారు. సీఎం జగన్ ప్రతీకారేచ్చకు ఈ అరెస్ట్ లు నిదర్శనం అని విమర్శించారు. జగన్ ఏడాది పాలన వైఫల్యాలపై చర్చను దారి మళ్లించేందుకే ఈ అరెస్ట్ లకు పూనుకున్నారని ఆరోపించారు. తాను జైలుకు వెళ్ళాననే కక్షతోనే తెలుగుదేశం నేతలను వరస పెట్టి జైలుకు పంపిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం నేతలను ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా దెబ్బతీసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, వీటిని అడ్డుకుంటామన్నారు. టీడీపీ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని....రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. ఈ అరెస్ట్ లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని చంద్రబాబు కోరారు. ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు ఉన్నందున ఇంటి నుంచే నిరసనలు తెలపాలని కోరారు.

Next Story
Share it