Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..లోకేష్ ల అరెస్ట్ తప్పదు

చంద్రబాబు..లోకేష్ ల అరెస్ట్ తప్పదు
X

అధికార వైసీపీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ పై టీడీపీ విమర్శలకు ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ఎటాక్ మొదలుపెట్టారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు అరెస్ట్‌ సర్వసాధారణం అన్నారు. చంద్రబాబు,లోకేష్‌ వ్యాఖ్యలు దురదృష్టకరమని, తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి బీసీలకు ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీసీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు.. వారిని గాలికొదిలేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు.

మరో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడుకు ప్రమేయం ఉందని తెలిపారు. అందుకే ఏసీబీ ఆయన్ను అరెస్ట్‌ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగిందని.. మెడిసిన్‌ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని మంత్రి జయరాం తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పనిని అనినీతిమయం చేశారన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు,లోకేష్‌ కూడా జైలుకెళ్లక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it