Telugu Gateway
Andhra Pradesh

ఒక ఎన్నిక..టీడీపీకి రెండు ఓటములు

ఒక ఎన్నిక..టీడీపీకి రెండు ఓటములు
X

ఎన్నికలో ఎప్పుడైనా గెలుపు లేదా ఓటమే ఉంటుంది. కానీ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మాత్రం ఒకే ఎన్నికలో ‘రెండు ఓటములు‘ నమోదు చేసుకుంది. టీడీపీ అయినా ఇతర పార్టీ అయినా అడ్డుపడితే అది ఆగిపోయేలా ఉండాలి. కానీ ఆగకపోయినా సరే నేను ప్రయత్నం చేస్తా అనటం రాజకీయంలో భాగమే కావొచ్చు. కానీ ఎలాంటి లోపాలు లేని పార్టీలకు అయితే అది ఓకే. టీడీపిపై రాజ్యసభ టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఎన్నో విమర్శలు..ఎన్నో ఆరోపణలు. అలాంటి టీడీపీ ఏ మాత్రం బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచి అంతిమంగా సాధించింది ఏమిటి?. టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య నినాదం ‘ఆత్మప్రభోదానుసారం’ ఓటు అసలు ఎవరైనా పట్టించుకున్నారా?. టీడీపీ రాజ్యసభ బరిలో నిలవటం ద్వారా అంతిమంగా మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కోవటం..ప్రజల్లో పలుచన కావటం తప్ప సాధించింది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్న ప్రతిసారి కూడా బడాబాబులకే టిక్కెట్లు ఇచ్చి ..ఖచ్చితంగా ఓడిపోయే సీటును వర్ల రామయ్యకు కేటాయించటం అనేది తెలుగుదేశం పార్టీ ఎలా సమర్ధించుకున్నా కూడా దాంట్లో ఏ మాత్రం హేతుబద్దత కన్పించదు.

నిజంగా ఈ పోటీకి దూరంగా ఉండి ఉంటే గత ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత అయినా ఇప్పుడు మరోసారి పాత విమర్శలు రిపిట్ అయ్యేవి కావని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. టీడీపీకి 23 మంది సభ్యులు అధికారికంగా ఉండగా..ఆ పార్టీ అభ్యర్ధికి కేవలం 17 మాత్రమే పడ్డాయి. అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కరణం బలరామ్, మద్దాలి గిరి అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి ఆస్పత్రిలో ఉండి పోలింగ్ కు దూరంగా ఉన్నారు. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కరోనా కారణంగా స్వీయ నిర్భందంలో ఉన్నారు. ఈ ఎన్నిక బరిలో నిలవటం ద్వారా ఎన్నికల్లో ఓడిపోవటం ఒకటి...అర్హత లేకుండా పోటీచేశారనే విమర్శలు..పాత తప్పులను తవ్వితీసి తిట్టించుకోవటం మరోకటి. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో ఓ అభ్యర్ధి ‘గెలిచేటప్పుడు సొంత కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకా ఇచ్చేది?’ అని ఓటింగ్ బ్యాలెట్ పేపర్‌పై రాశారు. అయితే అలా రాసిన ఎమ్మెల్యే ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Next Story
Share it