Telugu Gateway
Cinema

బాలకృష్ణ ‘తొలి గర్జన’ వచ్చేసింది

బాలకృష్ణ ‘తొలి గర్జన’ వచ్చేసింది
X

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ‘తొలి గర్జన’ అంటూ ఓ టీజర్ విడుదల చేశారు బోయపాటి శ్రీను. బుధవారం నాడు ఆయన 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. దీనికి తోడు ఈ కొత్త సినిమాకు సంబంధించిన ఓ టీజర్ ను కూడా విడుదల చేశారు.

ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. 4 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో నందమూరి అభిమానులకు కావాల్సిన మాస్ మసాలా డైలాగ్ లు ఉన్నాయి. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి రాంప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Ch9TLXI3bHU

Next Story
Share it