ఆ 150 కోట్ల స్కామ్ లో అచ్చెన్నాయుడి పాత్ర

ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నందునే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించిన అధికారులు దీనికి సంబంధించిన వివరాలను మీడియా ముందు పెట్టారు. ‘2014-2018 సంవత్సరాల కాలంలో మందులు, ల్యాబ్ కిట్స్ కొనుగోలు, సర్జికల్ ఐటెమ్స్, ఫర్నీచర్ కొనుగోలు వంటి వాటి విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిధులు దుర్వినియోగం అయ్యాయి. ఫేక్ బిల్స్, ఫేక్ ఇన్వాయిస్ లు క్రియేట్ చేశారు. నామినేషన్ బేసిస్ లో టెండర్లు కేటాయించారు. మార్కెట్ రేట్ల కంటే చాలా అధిక ధరలు చెల్లించారు. 988 కోట్ల రూపాయల కొనుగోళ్లలో 150 కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది.
రమేష్ కుమార్,మాజీ డైరక్టర్, డాక్టర్ విజయ్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్కాంలో ఇన్వాల్వ్ అయినట్లు తేలింది. అందుకే అరెస్ట్ చేశాం. విజలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంట్ విచారణ జరిపి నివేదిక ఏసీబీకి ఇచ్చింది. బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్స్ లో కూడా అవకతవకలు జరిగినట్లు కన్పిస్తోంది. వీటి అన్నింటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అచ్చెన్నాయుడు, ఇతర అధికారులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. రాష్ట్రమంతటా టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. ఉదయం 7.30 -8 గంటల మధ్యలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నాం.’ అని తెలిపారు.