Telugu Gateway
Telangana

అప్పా డైరక్టర్ వీ కె సింగ్ పై బదిలీ వేటు

అప్పా డైరక్టర్ వీ కె సింగ్ పై బదిలీ వేటు
X

డీజీపీగా పదోన్నతి కల్పించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీ కె సింగ్ తనకు పదవీ విరమణ అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తనకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ప్రభుత్వం పదోన్నతి కల్పించలేదనే ఉద్దేశంతో ఉన్నారు.

ఆయన ప్రస్తుతం అప్పా డైరక్టర్ గా ఉన్నారు. తెలంగాణ సర్కారు ఆయన్ను అప్పా డైరక్టర్ పదవి నుంచి తప్పించి డీజీపీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అప్పా ఇన్ ఛార్జి బాద్యతలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావుకు అప్పగించారు.

Next Story
Share it