Telugu Gateway
Andhra Pradesh

పాస్ ఉంటేనే ఏపీలోకి అనుమతి

పాస్ ఉంటేనే ఏపీలోకి అనుమతి
X

తెలంగాణ సర్కారు అంతరాష్ట్ర రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏపీ సర్కారు మాత్రం ‘ఈ-పాస్’ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అంతే కాదు..ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళే వారికి క్వారంటైన్ కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు. తొలి వారం రోజుల సంస్థాగత క్వారంటైన్..ఆ తర్వాత హోం క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. సో..తెలంగాణ అంతరాష్ట్ర రవాణాకు అనుమతి ఇచ్చినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందనే చెప్పాలి.

కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు తెలంగాణ సర్కారు అంతరాష్ట్ర రవాణాకు అనుమతి ఇచ్చింది. దీనికి ఎలాంటి పాస్ లు అక్కర్లేదని తెలిపింది. అయితే ఆయా రాష్ట్రాల అనుమతి ప్రకారమే ఇది ఉంటుందని పేర్కొంది. దీంతో ఏపీలో కూడా కేసులు పెరుగుతుండటంతో సర్కారు మాత్రం రవాణాపై ఆంక్షలు కొనసాగిస్తోంది. కొత్తగా ప్రకటన చేసే వరకూ ఇదే విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Next Story
Share it