Telugu Gateway
Andhra Pradesh

నవయుగాతో సర్కారు రాజీ..మెగాకే పోలవరం విద్యుత్ ప్రాజెక్టు

నవయుగాతో సర్కారు రాజీ..మెగాకే పోలవరం విద్యుత్ ప్రాజెక్టు
X

పోలవరం విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉంది. వాస్తవానికి పోలవరం పెండింగ్ పనులతోపాటు విద్యుత్ ప్రాజెక్టు పనులను కూడా రివర్స్ టెండరింగ్ లో మెఘా ఇంజనీరింగ్ కంపెనీనే దక్కించుకుంది. అయితే టెండర్ల ద్వారా దక్కించుకున్న తమ కాంట్రాక్ట్ రద్దు చేయటాన్ని నవయుగా కోర్టులో సవాల్ చేసింది. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి తమ తప్పేమీలేదని..ప్రభుత్వం నుంచే లోపాలు ఉన్నాయని నవయుగా కోర్టుకు నివేదించింది. దీంతో హైకోర్టు పోలవరం ప్రాజెక్టు పనులకు ఓకే చెప్పింది కానీ..విద్యుత్ ప్రాజెక్టు పనులకు బ్రేక్ లు వేసింది. అప్పటి నుంచి హైడ్రో ప్రాజెక్టు ముందుకు సాగటం లేదు. దీంతో తాజాగా సర్కారు నవయుగాతో రాజీకి వచ్చినట్లు కన్పిస్తోంది. అది ఎలా అంటే ఈ కాంట్రాక్ట్ అప్పగించేందుకు హైకోర్టులో జాయింట్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఫైల్ చేయటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాయింట్ అండర్ స్టాండింగ్ అంటే ఇందుకు నవయుగా ఆమోదం కూడా తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.

కంపెనీకి చెందిన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇఛ్చేయటంతోపాటు...పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించేందుకు సర్కారు ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే నవయుగా సంస్థ కూడ ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు అనే ఉధ్దేశంతో వెనక్కితగ్గినట్లు సమాచారం. పోలవరం హైడ్రో ప్రాజెక్టు ఐబీఎం విలువ 3216 కోట్ల రూపాయలు అయితే మెగా సంస్థ 12.6 శాతం లెస్ తో అంటే 2811 కోట్ల రూపాయలకు ఈ టెండర్ దక్కించుకుందని సర్కారు చెబుతోంది. దీంతో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకున్న మెగా ఇప్పుడు పోలవరం విద్యుత్ (హైడ్రో) ప్రాజెక్టు దక్కించుకున్నట్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలోనూ..ఇఫ్పుడు జగన్ హయాంలోనూ తన హవానే ఉంటుందని మెగా నిరూపించుకున్నట్లు అయింది.

Next Story
Share it