కేంద్ర మంత్రికి జగన్ లేఖ
BY Telugu Gateway11 Jun 2020 1:39 PM IST

X
Telugu Gateway11 Jun 2020 1:39 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ కు లేఖ రాశారు. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమానసర్వీసులను నడపాలని జగన్ తన లేఖలో కోరారు. గల్ఫ్, సింగపూర్ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ ద్వారా ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే.
Next Story