Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు

ఏపీలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు
X

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలతో సంబంధం లేకుండా పదవ తరగతి విద్యార్ధులను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం జూలై 10 నుంచి 17 వరకూ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇఫ్పుడు పరీక్షలు మొత్తం రద్దు చేశారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు లేకుండా పాస్ చేయాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తప్పనిసరి గా పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యా శాఖ ఎన్నో ఏర్పాట్లు చేసింది. ‘కరోనా కేసులు పెరుగుతున్నాయి. విద్యార్ధుల కోసం పలు కార్యక్రమాలు కూడా చేపట్టాం. యూ ట్యూబ్ లో కూడా విద్యార్ధుల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేశాం. విద్యార్ధులు పరీక్షల మూడ్ నుంచి పక్కకుపోకుండా పలు చర్యలు తీసుకున్నాం. పదకొండు పేపర్లను ఆరు పేపర్లకు తగ్గించాం.

లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్ధులు ఇంటికే పరిమితం అయ్యారు. ప్రతి క్లాస్ రూమ్ లో భౌతిక దూరం పాటించేలా సెంటర్లను కూడా పెద్ద ఎత్తున పెంచాం. అక్కడ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం. ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేయటం, ప్రశ్నాపత్రాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. విద్యార్ధులకు థర్మల్ స్క్రీనింగ్ కోసం ఏర్పాట్లు కూడా చేశాం. పరీక్షలకు సంబంధించి ప్రోటోకాల్స్ తో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాం. భాగస్వాములు అందరితో. విద్యార్ధుల ఆరోగ్య భద్రత దృష్టా అన్ని అంశాలు కూలంకషంగా చర్చించాం. పాఠశాల అధికారులతోనే పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదు. ఇతర శాఖల సహకారం కూడా కావాలి’ అని తెలిపారు. అన్ని అంశాలు పరీశీలించాకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Next Story
Share it