చంద్రన్న తోఫా..ఫైబర్ నెట్..హెరిటేజ్ మజ్జిగలపై సీబీఐ

జూన్ 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారం నాడు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సాగిన పలు స్కీమ్ లపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చంద్రన్న తోఫా పథకం, ఫైబర్ నెట్, హెరిటేజ్ మజ్జిగ సరఫరాలకు సంబంధించి జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. చంద్రన్న తోఫా, సంక్రాంతి, క్రిస్మస్ కానుక ల అమలు విషయంలో టెండర్ రూల్స్ కు విరుద్ధంగా ..ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల 150 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో గత ప్రభుత్వ పెద్దలు కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని అభిప్రాయపడ్డ కెబినెట్ సబ్ కమిటీ. సెట్ టాప్ బాక్స్ ల విషయంలో కూడా గోల్ మాల్ జరిగిందని తేల్చారు.
హెరిటెజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ద్వారా ఏడాదికి రూ. 40 కోట్ల మేర ఖర్చు పెట్టారని మంత్రి వర్గ ఉప సంఘం గుర్తింపు. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా. ఖర్చు పైనా సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పాపం బయటపడింది. మీ అందరి దగ్గరకు సీబీఐ వస్తుంది. ఉప్పు, పప్పు ఎవరు సరఫరా చేశారో అందరూ రెడీగా ఉండండి. త్వరలో బాబాయిలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి లెక్కలు సరిచేసుకుని. రాబోయే రోజుల్లో సీరియల్ గా చాలా వస్తున్నాయి చూడండి అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. గురువారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గం వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనున్న ప్రభుత్వం. వచ్చే ఆగస్టు 12న పధకం సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్టులో చర్చ. విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని, ఈ మేరకు కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం. మొదటి దశలో రూ. 4736 కోట్ల వ్యయంతో నిర్మాణం. రామాయపట్నం ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం జగన్ సూచన. రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని సీఎం జగన్ ఆదేశం.