ఏపీ అసెంబ్లీలో వినూత్న సన్నివేశం
BY Telugu Gateway16 Jun 2020 10:50 AM IST

X
Telugu Gateway16 Jun 2020 10:50 AM IST
కరోనా ఎన్నో కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. అలాగే ఏపీ అసెంబ్లీలోనూ మరో కొత్త సన్నివేశం ఆవిష్కృతం అయింది. ఏపీ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇలా చేయటం దేశంలోనే ఇదే తొలిసారి కావటం విశేషం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభం అయ్యాయి.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను ప్రస్తావించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని పేర్కొన్నారు.
Next Story