రాజ్యసభ ఓటింగ్ కు ఆ టీడీపీ ఎమ్మెల్యే దూరం

తెలుగుదేశం పార్టీకి చెందిన రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ రాజ్యసభ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలిన జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కలిశానని..అందుకే డాక్టర్ల సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ఆయన లేఖలోని ముఖ్యాంశాలు... ‘కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న నేను రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ పాల్గొన్నలేకపోతున్నాను. ఇటీవల వ్యాపార రీత్యా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశాను. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో నేను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్నాను.
అందుకే శుక్రవారం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌కు వైద్యుల సలహా మేరకు హాజరు కాలేకపోతున్నాను. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తున్నందున ఎవరి ప్రాణాలకు ముప్పు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనకపోవడం చాలా బాధాకరంగా ఉంది. పార్టీకి ఏ అవసరం వచ్చినా ముందుండే నేను ఈ విషయంలో రాలేకపోతున్నాను. పార్టీకి అవసరమైనప్పుడు ఎళ్ళవేళలా ముందు ఉంటాను’ అంటూ తన లేఖలో పేర్కొన్నారు. గత కొంత కాలంగా అనగాని సత్యప్రసాద్ పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.