Telugu Gateway
Andhra Pradesh

ముగ్గురు దొంగలు కలిపి ఎవరిపై కుట్ర చేశారు

ముగ్గురు దొంగలు కలిపి ఎవరిపై కుట్ర చేశారు
X

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు ముగ్గురు దొంగలు అని..ఈ ముగ్గురు దొంగలు ఎవరిపై కుట్ర చేశారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎంత పెద్ద లాయర్లను నియమించుకున్నారు. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంత పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించగలుగుతారా?. ఇదంతా చంద్రబాబునాయుడు చెల్లించి ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించటానికి చేస్తున్న ప్రయత్నం. రమేష్ కుమార్ రాజ్యాంగ బద్ద పదవిలో ఉండటానికి అర్హత కోల్పోయిన వ్యక్తి అని అంబటి వ్యాఖ్యానించారు. కుట్ర స్వభావం కలిగిన వ్యక్తి. ఆయన హయత్ లో దొరికిపోయాడు. ఈ ప్రుభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారా?. దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారా?. భ్రష్టు పట్టించాలని చూస్తున్నారా?. అందరూ కుమ్మక్కు అయి చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ చేతిలో తొలుబొమ్మలా చేశారు. రమేష్ కుమార్ తప్పుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తక్షణమే రమేష్ కుమార్ ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. హరీష్ సాల్వే ఫీజు ఎవరు సుజనా చౌదరి, చంద్రబాబు పే చేస్తున్నారా?. అని ప్రశ్నించారు. ఫేస్ టైమ్ లో ఎవరితో మాట్లాడారు. మీ బాస్ చంద్రబాబుతో మాట్లాడారా.? వీరు ముగ్గురు సమాధానం చెప్పాలి. దొంగ కాబట్టే రమేష్ కుమార్ ఇప్పటికీ నోరు మెదపలేదు అంటూ అంబటి ధ్వజమెత్తారు. ఈ రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ఆరోపించారు. సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంతో చంద్రబాబు ఎక్స్‌ పర్ట్‌ అని, వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.

Next Story
Share it