టాలీవుడ్ ప్రముఖులకు అమరావతి సెగ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మంగళవారం నాడు విజయవాడ చేరుకున్న టాలీవుడ్ ప్రముఖులకు ‘అమరావతి సెగ’ తగిలింది. విజయవాడ చేరుకుని ఓ గెస్ట్ హౌస్ లో బస చేసిన సినీ హీరోలు ఉన్న చోటకు అమరావతి రైతులు చేరుకున్నారు. తమ అవసరాల కోసం కోట్ల రూపాయల వ్యయం చేసి ప్రత్యేక విమానాల్లో వచ్చిన సినిమా హీరోలు.. వాళ్ల సమస్యలతో పాటు గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్న అమరావతి రైతుల అంశాన్ని కూడా జగన్ వద్ద ప్రస్తావించాలని వీళ్ళు డిమాండ్ చేశారు.
చిరంజీవి రైతు సమస్యలతో ఖైదీ నెంబర్ 150 సినిమా తీస్తే తాము ఆదరించామని..అలాగే నాగార్జున సినిమాలను కూడా ఆదరించామని అన్నారు. అందుకే వారి సమస్యలతోపాటు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల గురించి సీఎం వద్ద ప్రస్తావించాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే సినీ ప్రముఖులు ఉన్న గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న అమరావతి రైతులను పోలీసులు అడ్డుకున్నారు.