Telugu Gateway
Andhra Pradesh

ఆశించిన స్థాయిలో పెద్ద పరిశ్రమలు రాలేదు

ఆశించిన స్థాయిలో పెద్ద పరిశ్రమలు రాలేదు
X

ఏపీకి గత ఏడాది కాలంలో ఆశించిన స్థాయిలో పెద్ద కంపెనీలు రాలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వరకూ పర్వాలేదన్నారు. ‘పెద్ద కంపెనీల విషయంలో అనుకున్న స్థాయిలో లేము. ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. బెటర్ గా ఎలా చేయాలో..సలహాలు..సూచనలు తీసుకుంటాం. పరిశ్రమలు రావాలి..ఇదే మా కోరిక కూడా.’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రాలకు లేని వనరులు మనకు ఉన్నాయి. చంద్రబాబు లాగా నేను అబద్దాలు చెప్పను. 20 లక్షల కోట్ల ఒఫ్పందాలు..40 లక్షల ఉద్యోగాలు వంటి మాయమాటలు చెప్పను. పరిశ్రమలకు అత్యంత కీలకమైన భూమి, విద్యుత్, నైపుణ్యం గల మానవ వనరులపైనే ఫ్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ఇందులో పరిశ్రమలకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి గత ప్రభుత్వం ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ అని చెప్పుకున్నారు. గతంలో రాయితీలు ఇవ్వాలంటే ప్రభుత్వ పెద్దలకు చేతులు తడపాల్సిన పరిస్థితి డేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.

పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో నెగిటివ్ మాజీ ముఖ్యమంత్రికి తోడు..నెగిటివ్ మీడియా కూడా ఉంది. పరిశ్రమలకు రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉంది. ఈ ఏడాది 34 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాం. పరిశ్రమలు కాపాడుకుంటేనే ఉధ్యోగాలు వస్తాయి. హైదరాబాద్, బెంగూళరు, చెన్నయ్ లోతో పోటీపడే నగరం విశాఖపట్నం ఒక్కటే అని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీకి 972 కిలోమీటర్ల కోస్తా తీరం.. మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ, నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్టులున్నాయని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. పరిశ్రమలు వచ్చేవి. జీఎస్టీతోపాటు అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవి. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా హోదా రాలేదు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేది.

ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదు.. బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉంది. పరిశ్రమలకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమలకు నీరు ఇచ్చేందుకు బలమైన వ్యవస్థ ఉంది. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. పరిశ్రమలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాం. కియా వెళ్లిపోతుందంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా దుష్ప్పచారం చేసింది. చివరికి కియా యాజమాన్యం ముందుకొచ్చి.. ఏపీలో మంచి ప్రభుత్వం ఉంది.. మేమెందుకు వెళ్తామని చెప్పింది. కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. రూ. 11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరో 23 ప్రముఖ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 90వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టుకోవాల్సి ఉందని తెలిపారు.

Next Story
Share it