విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నష్టపరిహారం విడుదల
BY Telugu Gateway8 May 2020 6:43 PM IST

X
Telugu Gateway8 May 2020 6:43 PM IST
వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు వెలువడ్డాయి. గురువారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి బాధిత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు చికిత్స పొందుతున్న వారికి, ప్రభావిత గ్రామాల ప్రజలకు పరిహారం ప్రకటించారు.
వీటి అన్నింటి కోసం 30 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ అయింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్ పై ఉన్న వారికి పది లక్షల రూపాయలు, మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లిన వారికి లక్ష రూపాయలు, ప్రాధమిక చికిత్స తర్వాత వెళ్లిన వారికి పది వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Next Story