Telugu Gateway
Andhra Pradesh

చెన్నయ్ టీటీడీ ఆస్తుల విక్రయం..రాజకీయ దుమారం

చెన్నయ్ టీటీడీ ఆస్తుల విక్రయం..రాజకీయ దుమారం
X

చెన్నయ్ లోని తిరులమ తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధీనంలో ఉన్న ఆస్తుల అమ్మక నిర్ణయం దుమారం రేపుతోంది. తమిళనాడులో ఉన్న లాభదాయకం కాని..నిర్వహణ సాధ్యం కాని ఆస్తులను అమ్మాలని టీటీడీ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్న టీటీడీ ఖాతాలోనే జమ చేయనున్నారు. బహిరంగ వేలం ద్వారా చెన్నయ్ లో ఉన్న వ్యవసాయ భూములు, ఇళ్ళ స్థలాలు, భవనాలను విక్రయానికి పెట్టారు. ఈ అమ్మకపు జాబితాలో మొత్తం 23 ఆస్తులు ఉన్నాయి. ప్రతి ఆస్తికి కనీస ధర (అప్ సెట్ ప్రైస్) నిర్ణయించి వేలం పెట్టాలని ప్రతిపాదించారు. దీని కోసం టీటీడీ రెండు బృందాలను ఏర్పాటు చేసింది.

ఆయా బృందాలే ఆస్తులను విక్రయించి..ఎవరైతే వీటిని కొనుగోలు చేశారో వారిపేరు మీద వీటిని బదలాయించాల్సిన బాధ్యత కూడా ఆ బృందాలదే అని తెలిపారు. అయితే టీటీడీ ఆస్తుల అమ్మకంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఆస్తులను అమ్మటం సరికాదని..ఈ ప్రక్రియను నిలిపివేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. బిజెపి ఎంపీ టీ జీ వెంకటేష్ కూడా గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయని..అయినా సరే ఆస్తుల అమ్మటానికి దిగటం సరికాదన్నారు. టీటీడీ ఈ విషయంలో ముందుకెళితే తాము మళ్ళీ కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు.

Next Story
Share it