Telugu Gateway
Andhra Pradesh

టీటీడీ భూముల వేలం వద్దు..సర్కారు జీవో జారీ

టీటీడీ భూముల వేలం వద్దు..సర్కారు జీవో జారీ
X

ఏపీలో పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయిన టీటీడీ భూముల వేలం ప్రతిపాదనకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం నియమించిన బోర్డు తీసుకున్న నిర్ణయాల అమలును నిలుపుదల చేస్తూ ఏపీ సర్కారు సోమవారం నాడు జీవో 888 జారీ చేసింది. ఈ మేరకు బోర్డు తీర్మానం 253ను నిలుపుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. 2016 జనవరి 30న చేసిన తీర్మానంలో 50చోట్ల ఉన్న టీటీడీ భూములు అమ్మాలని అప్పటి బోర్డు నిర్ణయించింది. భక్తుల మనోభవాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం సూచించింది.

ఈ భూముల అమ్మకం నిర్ణయాన్ని పరిశీలించాలని కోరారు. అంతే కాకుండా భక్తులతోపాటు ఆథ్యాత్మిక పెద్దలు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకునే ముందుకెళ్ళాలని సూచించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకూ ఆ 50 ఆస్తుల అమ్మకం ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టాలని టీటీడీ ఈవోను ఆదేశిస్తూ సాదారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్కారు తాజా ఆదేశాలతో వివాదానికి తెరపడినట్లు అయింది.

Next Story
Share it