Telugu Gateway
Telangana

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలకు హైకోర్టు అనుమతి ఇఛ్చింది. అయితే జూన్ 3 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. జూన్ 8 నుండి టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించింది. అదే సమయంలో లాక్ డౌన్ లో పరీక్షలు వద్దని..అప్పటి కరోనా ఉధృతిని సమీక్షించిన నిర్ణయం తీసుకోవాలన్నారు. పరీక్ష పరీక్షకు మధ్య గ్యాప్ పెట్టుకోవటంతో పాటు విద్యార్ధుల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది.

పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జూన్ 3 తర్వాత పరిస్థితిని సమీక్షించి జూన్ 4 న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు అదేశించింది. టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించగా..అన్ని చర్యలు చేపడుతామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.

Next Story
Share it