Telugu Gateway
Telangana

ఐటి ఎగుమతుల్లో దూసుకెళుతున్న తెలంగాణ

ఐటి ఎగుమతుల్లో దూసుకెళుతున్న తెలంగాణ
X

ఐటి రంగంలో తెలంగాణ తన సత్తా చాటుతోంది. ఐటి ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09 శాతం ఉంటే తెలంగాణ ఐటి ఎగుమతులు మాత్రం 17.93 శాతంగా ఉన్నాయి. దేశంలో తెలంగాణ ఎగుమతుల వాటా 10.6 శాతం నుంచి 11.06 శాతానికి చేరటంపై ముఖ్యమంత్రి కెసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటి శాఖ పనితీరును ప్రశంసించారు. రాబోయే రోజుల్లోనూ ఐటి పెట్టుబడులకు తెలంగాణ అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందనే విషయం తేలిందని కెసీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఐటి కార్యకలాపాలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా..పనులు సాఫీగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని ఐటి శాఖను ఆదేశించారు.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఐటి ఎగుమతులు, ఉద్యోగాల కల్పనకు సంబంధించిన వివరాలను సీఎం కెసీఆర్ మంత్రి కెటీఆర్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు. తెలంగాణలో ఐటి ఉద్యోగాల కల్పనలో కూడా వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 4.93 శాతం మాత్రమే. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2018-19లో రూ. 1,09,219 కోట్లు ఉండగా.. అది 2019-20లో రూ. 1,28,807 కోట్లకు పెరిగాయి.

Next Story
Share it